కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో ఒంగోలు రిమ్స్ వైద్యాధికారులతో మంత్రి సమీక్షించారు. కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకునేలా వైద్యులు కృషిచేయాలని సూచించారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. మెడికల్ స్టాప్‌ను పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సంబంధిత మందులు అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు నెలలు ఇక్కడే ఉండి బాధితులను ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకునేలా వైద్యులు కృషిచేయాలి: మంత్రి బాలినేని - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
కొవిడ్ మహమ్మారి బాధితులు పూర్తిగా కోలుకునేలా వైద్యులు కృషిచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఒంగోలు కలెక్టరేట్లో రిమ్స్ వైద్యాధికారులతో కరోనా వైరస్ కట్టడి చర్యలపై సమీక్షించారు.
minister Srinivas reddy Review on covid with Medical Officers