మాట్లాడుతున్న మంత్రి శిద్ధా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్వార్థంతోనే తెదేపాను వీడారని మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ సునీత విమర్శించారు. ప్రకాశం జిల్లా చీరాలలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నేతలు... ఆమంచిపై ధ్వజమెత్తారు. పార్టీ వీడాక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరాల నేతలు, కార్యకర్తలంతా తెదేపాలోనే ఉన్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని అడ్డుపెట్టుకుని ఎదిగిన నాయకులు... ఇప్పుడు విమర్శించడం దారుణమన్నారు.