ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం పేర్నమెట్టలో 'నూతన సాగు విధానంపై చర్చించుకుందాం' అంశంపై ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రులు బాలినేని శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేశ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి... రైతులకు ప్రయోజనం చేకూరే ఈ కార్యక్రమాన్నైనా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
లాక్డౌన్ కారణంగా పొగాకు రైతులకు పంట అమ్ముకోడాని ఇబ్బందులు తలెత్తాయి. పొగాకు రైతుల ఇబ్బందులు తొలగించడానికి రాష్ట్రంలో తొలిసారిగా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నాం. దశలవారీగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా వ్యాపారం సాగిస్తాం. ప్రతీ ఏటా కొనుగోళ్లు చేపడతాం. దీంతో గ్రేడ్ పొగాకుకు మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ---- కురసాల కన్నబాబు , వ్యవసాయశాఖ మంత్రి
తొమ్మిది గంటల పాటు విద్యుత్