ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో 1,856 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌లతో పాటు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, కలెక్టర్ పోల భాస్కర్.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
'సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే చంద్రబాబు కేసులు పెడుతున్నారు' - మంత్రి బొత్స చేతుల మీదుగా చీమకుర్తి మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీ
గతంలో ఎవ్వరూ చేయని విధంగా.. తక్కువ వ్యవధిలోనే వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి.. 1,856 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తమ హయాంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక.. చంద్రబాబు కేసులు పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
!['సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే చంద్రబాబు కేసులు పెడుతున్నారు' housing sites distribution in cheemakurti mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10312901-1081-10312901-1611143982682.jpg)
చీమకుర్తి మండలంలో ఇళ్ల స్థలాల పంపిణీ
ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేని విధంగా.. అతికొద్ది సమయంలోనే వైకాపా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని బొత్స పేర్కొన్నారు. ఈ పథకాలను చూసి ఓర్వలేక చంద్రబాబు కేసులు పెడుతున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు తరహా నాయకులు మారాలన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:ఈనెల 22న ప్రకాశం జిల్లాకు పవన్ కల్యాణ్