సీఎం జగన్ ప్రజారంజక పాలనే స్థానిక ఎన్నికల్లో విజయానికి కారణమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థలో.. అత్యధిక మెజారిటీతో వైకాపాను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే విజయానికి కారణమన్నారు. తమ ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారన్నది.. స్థానిక ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టం అవుతోందని మంత్రి చెప్పారు.
'తండ్రీ కుమారులు ప్రచారం చేసినా.. ఒక్క మున్సిపాలిటీని గెలుచుకోలేకపోయారు' అని మంత్రి విమర్శించారు. ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిని తమ పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని చెప్పారు. మరోవైపు... పట్టణంలోని 45వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన వెన్నపూస కుమారి వైకాపాలో చేరారు. గెలుపొందిన కార్పొరేటర్లను మంత్రి అభినందించారు.