తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బకాయిపడ్డ విద్యుత్ చార్జీలు తాము చెల్లించాల్సి వస్తుందని.. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడిన ఆయన..2014 నుంచి 2019 వరకు రెగ్యులేటరీ కమిషన్కు వేలాది కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని..ఆ బకాయిలు ఇప్పుడు చెల్లించమని డిస్కంలు డిమాండ్ చేయడంతో ట్రూ అప్ ఛార్జీలు వేయాల్సి వచ్చిందన్నారు. మరో ఏడు, ఎనిమిది నెలలు ఈ ఛార్జీలు భరించాల్సిందేనని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.
MINISTER BALINENI: 'మరో ఏడెనిమిది నెలలు భరించాల్సిందే' - Minister Balineni Srinivasareddy latest news
విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు మరో ఏడు, ఎనిమిది నెలలు భరించాల్సిందేనని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం హయాంలో డిస్కంలకు నిధులు చెల్లించకపోవడంవల్లే ఇప్పుడు ట్రూ అప్ భారం మోయాల్సి వస్తోందన్నారు. ఐదుసార్లు విద్యుత్ చార్జీలు పెంచామన్న తెలుగుదేశం ఆరోపణలను ఆయన ఖండించారు.

బకాయిల్లో 900 కోట్ల రూపాయల వరకు రైతుల వాటా ఉందని అది ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచామన్న తెలుగుదేశం ఆరోపణలను ఆయన ఖండించారు. ట్రూఅప్ ఛార్జీల వల్ల అద్దె ఇళ్ల వారికి వచ్చే ఇబ్బందుల విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడతామని మంత్రి తెలిపారు.
'ట్రూ అప్ ఛార్జీలు మరో 7, 8 నెలలు భరించాల్సిందే. తెదేపా హయాంలో నిధులు చెల్లించకపోవడం వల్లే ఇప్పుడు భారం. ఐదుసార్లు చార్చీలు పెంచామన్న తెదేపా ఆరోపణలు అవాస్తవంట్రూఅప్ ఛార్జీల వల్ల అద్దె ఇళ్ల వారికి వచ్చే ఇబ్బందుల విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడతా' -మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి