ప్రజల సంక్షేమం కోసం ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని మంత్రి నివాసంలో అనందయ్య మందును పంపిణీ చేశారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికే రెండుసార్లు ఆనందయ్య మందును అందించామన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో మందు పంపిణీ పూర్తయ్యాక ఇతర నియోజకవర్గాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి మందు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆనందయ్య కరోనా మందు పంపిణీ: మంత్రి బాలినేని - Anandayya Corona medicine in Ongole
ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఈ మందు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి