ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Minister Balineni: మంత్రివర్గ విస్తరణలో వందశాతం కొత్తవారే.. పార్టీ ముఖ్యమన్న బాలినేని - cabinet reshuffle andhra pradesh

minister balineni
minister balineni comments on cabinet reshuffle

By

Published : Sep 25, 2021, 4:56 PM IST

Updated : Sep 26, 2021, 4:32 AM IST

16:45 September 25

minister balineni comments on cabinet reshuffle

మంత్రి బాలినేని

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో వందశాతం కొత్త వారికి చోటు ఉంటుందని విద్యుత్తుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(minister balineni comments on cabinet reshuffle news) తెలిపారు. శనివారం ఒంగోలులో జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మొన్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మంత్రివర్గాన్ని వంద శాతం మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు. మంచిది సర్‌! నాకు అభ్యంతరం లేదన్నాను. పార్టీ విధానపరమైన నిర్ణయమైతే కచ్చితంగా మార్చండి, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పాను.

ఈ క్రమంలో మంత్రి పదవి పోయినా భయపడను. నాకు పార్టీయే ముఖ్యం’ అని బాలినేని స్పష్టం చేశారు. నేతలంతా కలిసి పనిచేయాలని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇదే విషయం స్పష్టం చేశారన్నారు. పదవుల కోసం ఒకరిపై ఒకరు చెప్పుకోకూడదని నేతలకు సూచించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు అన్యాయం జరగదని, సరైన సమయంలో మంచి అవకాశాలు వస్తాయన్నారు.

'మంత్రివర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పా. మంత్రి పదవి పోయినా నేను భయపడను. నాకు పార్టీ ముఖ్యం, పదవులు కాదు' - మంత్రి బాలినేని

ఇదీ చదవండి

LIVE UPDATES: కొత్త జడ్పీ ఛైర్మన్లు వీరే...

Last Updated : Sep 26, 2021, 4:32 AM IST

ABOUT THE AUTHOR

...view details