Minister Balineni Srinivasa Reddy on YS Sharmila: షర్మిలమ్మ మా వైఎస్ కుటుంబ సభ్యురాలు, మేమంతా ఒక్కటే.. అని రాష్ట్ర విద్యుత్తు శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో షర్మిల పార్టీ పెట్టడం గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.
ఎవరో అడిగిన ప్రశ్నకు.. ఆంధ్రలో పార్టీ పెడితే తప్పేమిటని ఆమె అన్నారే తప్ప.. పార్టీ పెడతామని చెప్పలేదని బాలినేని అన్నారు. ఒంగోలులో విలేకరులతో మాట్లాడిన మంత్రి.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన.. జనరంజకంగా ఉందని మంత్రి అన్నారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని.. ఎన్నికల అవసరం కోసం ఇతర పార్టీల మీద ఆధారపడి పొత్తుల కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.