ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నిర్లక్ష్యం కారణంగానే నీటి సమస్య: బాలినేని - Ongole

తెదేపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే... ఒంగోలు నగరంలో నీటి సమస్య తలెత్తిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఆయన పరిశీలించారు.

తెదేపా నిర్లక్ష్యం కారణంగానే నీటి సమస్య: బాలినేని

By

Published : Jul 20, 2019, 11:02 PM IST

తెదేపా నిర్లక్ష్యం కారణంగానే నీటి సమస్య: బాలినేని

తెదేపా ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే ఒంగోలు నగరంలో నీటి ఎద్దటి ఏర్పడిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 4రోజులకోసారి నీళ్లొచ్చే దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను మంత్రి పరిశీలించారు. అధికారులను అడిగి నీటి నిల్వలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆగస్టు 15వరకు ప్రస్తుత నీటి నిల్వలు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. జలవనరుల శాఖ మంత్రిని అడిగి వీలైనంత త్వరగా సాగర్ నీరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు చేరేలా చూస్తానని హామీఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నగరవాసులకు నీటి సమస్య లేకుండా చూస్తానన్నారు. గత ప్రభుత్వం గుండ్లకమ్మ నుంచి నగరానికి నీటి పైప్​లైన్ వేస్తామంటూ... హడావుడి చేసిందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details