ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ కోతలపై దుష్ప్రచారం.. వారిపై కఠిన చర్యలుంటాయ్: బాలినేని - విద్యుత్ పై దుష్ప్రచారం చేస్తే చర్యలుంటాయ్

విద్యుత్ సంక్షోభంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై తప్పక చర్యలుంటాయని మంత్రి బాలినేని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ సమస్య దేశం మెుత్తంలో ఉందన్న ఆయన.. ఏపీ సర్కారుపై కొందరు కావాలని బురద చల్లుతున్నారని అన్నారు.

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

By

Published : Oct 17, 2021, 9:48 AM IST

రాష్ట్రంలో విద్యుత్ కోతపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.

తక్కువ ధరకు సౌర విద్యుత్ సరఫరా చేసేందుకు ఉత్పత్తిదారులు ముందుకు వస్తే.. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేశాయని ఆరోపించారు. విద్యుత్ సంక్షోభం దేశం అంతటా ఉందని.. ఒక్క తెలంగాణ తప్ప మిగతా సరిహద్దు రాష్ట్రాలకు కూడా బొగ్గు కొరత ఉందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details