ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారా లోకేశ్​ సహా పలువురికి మంత్రి బాలినేని లీగల్ నోటీసులు - నారా లోకేశ్ తాజా వార్తలు

తమిళనాడులో పట్టుబడ్డ 5.27 కోట్ల రూపాయలు తనవిగా తప్పుడు ప్రచారం చేశారంటూ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి... పలువురు నేతలు, పలు మీడియా సంస్థల ప్రతినిధులకు లీగల్ నోటీసులు జారీ చేశారు. వీరిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఉన్నారు.

minister balineni srinivasulu
minister balineni srinivasulu

By

Published : Aug 21, 2020, 10:33 PM IST

గత నెలలో తమిళనాడులో పట్టుబడ్డ 5.27 కోట్ల రూపాయలు తనవిగా తప్పుడు ప్రచారం చేశారంటూ రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పలు మీడియా సంస్థలు, వెబ్ ఛానల్ ప్రతినిధులకు, పలువురు నేతలకు లీగల్ నోటీసులు జారీ చేశారు.

'తమిళనాడు పోలీసులకు దొరికిన డబ్బు బంగారం వర్తకుడు మల్లమిల్లి బాలుకు సంబంధించింది. డబ్బును తరలిస్తున్న కారు మీద ఎం.ఎల్.ఏ. స్టిక్కర్ ఉండటంపై ఆ డబ్బు నాదంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఆ కారు, డబ్బుకు నాకు సంబంధం లేదని వివరణ ఇచ్చినా అదే పనిగా నాపై దుష్ప్రచారం చేశార'ని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అసత్య ప్రచారం చేశారంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బొండా ఉమామహేశ్వర రావు, బొల్లినేని రాజ గోపాల నాయుడు సహా కొన్ని మీడియా సంస్థలు, వెబ్ ఛానల్​ ప్రతినిధులకు నోటీసులు పంపించారు.

ABOUT THE AUTHOR

...view details