ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2021, 10:11 PM IST

ETV Bharat / state

మూడో దశను ఎదుర్కొవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలి: మంత్రి బాలినేని

ప్రకాశం జిల్లాలో కరోనా మూడో దశను ఎదుర్కొవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని అధికారులకు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్ వ్యాకిన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని.. ఫీవర్ సర్వే వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

minister balineni
మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

ప్రకాశం జిల్లాలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. కొవిడ్ నియంత్రణ, నివారణ, శాంతి భద్రతల అంశాలపై ఒంగోలు ఎన్.ఎస్.పీ.గెస్ట్ హౌస్​లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్​లతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కరోనా మూడో దశను ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. కొవిడ్ వ్యాకిన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

జిల్లాలో ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించే ఫీవర్ సర్వే వేగంగా పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్​లో ఆక్సిజన్ బెడ్స్ అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.

చెక్కును అందజేస్తున్న మంత్రి

ఇటీవల కనిగిరిలో కరోనాతో మృతి చెందిన భార్యభర్తలు మునగాల విశ్వనాధ్, స్రవంతిల కుమారుడు అభిరామ్​కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details