ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా నివారణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది' - minister balineni pressmeet

కరోనా నివారణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు రిమ్స్‌లో ఓపీ దగ్గర వేచివున్న వారిని చూసి వైద్యం అందటంలేదని మీడియాలో రావడం బాధాకరమన్నారు.

minister balineni
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

By

Published : Apr 27, 2021, 8:58 PM IST

కొవిడ్‌ రెండో దశ నివారణ కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని.. ముఖ్యమంత్రి ప్రతీక్షణం దీనిపై సమీక్షిస్తూ, రాష్ట్రంలో పరిస్థితిపై అధికారులకు దిశనిర్ధేశం చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఒంగోలు రిమ్స్‌లో వైద్య సేవలు మెరుగ్గానే ఉన్నాయని, ఓపీ దగ్గర వేచివున్న వారిని చూసి వైద్యం అందటంలేదని మీడియాలో రావడం బాధాకరమన్నారు. బాధితులకు అదనపు మంచాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details