రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్రానికి ఫిర్యాదు చేస్తాననడం సమంజసం కాదని.. కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదని.. కేంద్రం ఈ విషయాన్ని అర్థం చేసుకుని రాష్ట్రాలను ఆదుకోవాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వేల కోట్ల అప్పులు చేశారని.. ఆ విషయంపై అప్పట్లో భాజాపా నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు విబేధాలను సృష్టిస్తున్నారని చెప్పారు.
తెదేపా చేసిన అప్పులపై భాజపా నాయకులు ఎందుకు మాట్లాడలేదు?: మంత్రి బాలినేని - ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజా వార్తలు
తెదేపా హయాంలో చేసిన అప్పులపై భాజపా నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి బాలినేని ప్రశ్నించారు. కరోనా కారణంగా భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోము వీర్రాజు కేంద్రానికి ఫిర్యాదు చేస్తాననడం సమంజసం కాదని హితవు పలికారు.
minister balineni on somu veerraju