Minister Balineni On Power Cut: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడున్నాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. సాంకేతికంగా ఎక్కడో చిన్న లోపం వచ్చి రెండు రోజులు సరఫరాలో అంతరాయం కలిగితే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మినీ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్ బకాయిల భారాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నామని అన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని, రాష్ట్రంలో విద్యుత్తు కోతలు ఉండవని ఆయన పేర్కొన్నారు.
Minister Balineni On Power Cut: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడున్నాయి ?: మంత్రి బాలినేని - Minister Balineni On Power Cut:
Minister Balineni On Power Cut: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడున్నాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. సాంకేతికంగా ఎక్కడో చిన్న లోపం వచ్చి రెండు రోజులు సరఫరాలో అంతరాయం కలిగితే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడున్నాయి ? -మంత్రి బాలినేని