కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపునకే మీటర్లు పెడుతున్నామని మంత్రి బాలినేని తెలిపారు. విద్యుత్ నగదు బదిలీతో రైతులపై ఒక్క రూపాయి భారం మోపబోమని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని... ఒకవేళ రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినా.. విద్యుత్ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా నగదు బదిలీ చేయబోతున్నట్లు చెప్పారు.
కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఒంగోలు రిమ్స్ లో కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో వచ్చిన ఆరోపణలు మళ్లీ వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సమావేశానికి మంత్రి బాలినేనితోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ పోలా భాస్కర్, జేసి చేతన్ హాజరయ్యారు.