ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

90 శాతం పంచాయతీలు వైకాపావే: మంత్రి బాలినేని - పంచాయతీ ఎన్నికలపై మంత్రి బాలినేని

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో 90శాతం పంచాయతీలను వైకాపా గెలుచుకుంటుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా నేతలతో చర్చించారు.

Breaking News

By

Published : Jan 28, 2021, 10:13 PM IST

ప్రకాశం జిల్లాలో 90శాతం పంచాయతీ స్థానాలను వైకాపా గెలుచుకుంటుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైకాపా జిల్లా కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై ముఖ్య నాయకులతో సమాలోచనలు చేశారు. జిల్లా పార్టీ పర్యవేక్షకులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సమక్షంలో ఆదిమూలపు సురేష్‌, జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్​లతో సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ పట్ల, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పట్ల ప్రజల్లో మంచి పేరుందని.. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం సాధిస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details