ప్రకాశం జిల్లాకు చీరాల మినహా మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ జలకళ రిగ్గుల వాహనాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ జెండా ఊపి ప్రారంభించారు. గత ప్రభుత్వ హయంలో భూగర్భ జలాల వినియోగంలో పూర్తిగా విఫలమైందని, రైతులు వ్యవసాయ బోర్లు వేసుకోవాలంటే లక్షల రూపాయలు అప్పులు చేసుకునేవారని ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఈ కార్యక్రమం రైతుల పాలిట వరమని, విప్లవాత్మకమైన నిర్ణయం అని ఎంపీ మాగుంట శ్రీనివాసలరెడ్డి చెప్పారు.
'రైతు ప్రభుత్వమని వైకాపా మరోసారి నిరూపించుకుంది' - వైఎస్ఆర్ జలకళ ప్రారంభం తాజా వార్తలు
రైతులకు ఉచితంగా బోర్లు వేసి ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. మరోసారి రైతు ప్రభుత్వం అనిపించుకుందని మంత్రి ఆదిములపు సురేష్ అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
!['రైతు ప్రభుత్వమని వైకాపా మరోసారి నిరూపించుకుంది' 'రైతు ప్రభుత్వమని వైకాపా మరోసారి నిరూపించుకుంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8971266-444-8971266-1601301936585.jpg)
'రైతు ప్రభుత్వమని వైకాపా మరోసారి నిరూపించుకుంది'