ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం' - మంత్రి ఆదిమూలపు సురేశ్ తాజా వార్తలు

గిరిజనుల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించిన గిరిజనులకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో సకల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

adimulapu suresh
adimulapu suresh

By

Published : Oct 17, 2020, 6:58 PM IST

గిరిజన అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఉద్ఘాటించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గురుకుల పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన గిరిజనులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థినులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో అలరించారు. దాదాపు వెయ్యి మంది గిరిజనులకు 2200 ఎకరాల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు.

గిరిజనులకు వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ.. వారి అభివృద్ధికి కృషిచేస్తుందని మంత్రి అన్నారు. చెంచుగూడాల్లో రానున్న రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గిరిజనులకు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆ భూములపై వారికి పూర్తి హక్కులు కల్పిస్తూ.. ప్రభుత్వం అందించే పథకాలు వర్తింపచేస్తామన్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి :తితిదే నిధులతో బాండ్ల కొనుగోలుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

ABOUT THE AUTHOR

...view details