ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిసెంబర్ 31 నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ: మంత్రి సురేష్

తుపానుతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. డిసెంబర్ 31 నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో పంట నష్టంపై ఆయన ఆరా తీశారు.

minister adimulapu suresh
minister adimulapu suresh

By

Published : Dec 5, 2020, 7:52 PM IST

నివర్ తుపానుతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సురేష్​తో పాటు మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు పాల్గొన్నారు. శాఖల వారీగా నష్టాల వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజక వర్గాల్లో ఎక్కువగా పత్తి, వరి, మినుము, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు మంత్రికి తెలిపారు.

అధికారులపై ఎమ్మెల్యే అసహనం

గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు మండలంలో పంట నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేయకపోవటంపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అంతమంది రైతులు పంట నష్టపోతే వారి జాబితా ఎందుకు తయారు చేయలేదని నిలదీశారు. స్పందించిన మంత్రి వెంటనే జాబితా సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోనే ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ-క్రాప్​లో నమోదు కాని రైతులు ఎవరైనా ఉంటే అలాంటి రైతుల జాబితా ప్రత్యేకంగా సిద్ధం చేసి నివేదించాలని మంత్రి సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతు పేరు నమోదు చేసి పరిహారం అందేలా చూడాలన్నారు. డిసెంబర్ 31 కల్లా రైతుల ఖాతాల్లో నగదు జమ కానున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.

ఇదీ చదవండి

మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇచ్చి ఆదుకోవాలి: పవన్

ABOUT THE AUTHOR

...view details