సీఎం జగన్ రైతు పక్షపాతి అని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. రైతు భరోసా రెండో విడత సాయం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రైతుల బాధలను స్వయంగా చేసిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని అన్నారు. అందుకే రైతు భరోసా కింద 13వేల 500రూపాయలను అన్నదాత ఖాతాల్లో వేస్తున్నారని తెలిపారు. రైతులకు అందిస్తున్న సాయాన్ని చూడలేకే ప్రతిపక్ష పార్టీలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో రైతులను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి జగన్ రైతు పక్షపాతి: మంత్రి సురేశ్
అన్నదాత బాధలను తెలిసిన సీఎం జగన్... వారికి ఆర్థిక సాయం అందించేందుకే రైతు భరోసాను తీసుకొచ్చారని మంత్రి సురేశ్ అన్నారు. తెదేపా ప్రభుత్వంలో వారిని పూర్తిగా విస్మరిస్తే...తమ ప్రభుత్వంలో ప్రతి కర్షకుడు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
minister adimulapu suresh