Minister Suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయపు నడకకు వెళ్లిమ మంత్రి ఒక్కసారిగా కిందపడిపోయారు. మార్కాపురంలోని తన కళాశాలలో ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో వైద్యులు వెంటనే కళాశాలకు చేరుకుని సురేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్లే ఆయన కిందపడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కళాశాలలోనే మంత్రి సురేశ్ విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆదిమూలపు సురేశ్‌కు అస్వస్థత.. వాకింగ్ చేస్తూ కిందపడిపోయిన మంత్రి! - మంత్రి ఆదిమూలపు సురేశ్ కు అస్వస్థత
Minister Suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం తన కళాశాలలో.. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన మంత్రి ఒక్కసారిగా కిందపడ్డారు. విషయం తెలుసుకున్న వైద్యులు అక్కడకు చేరుకుని చికిత్స అందించారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్ కు మరోసారి అస్వస్థత
కాగా.. కొన్ని రోజుల క్రితం మంత్రి సురేశ్ అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించి స్టంట్ వేశారు. ఆ తర్వాత ఇంటికొచ్చిన సురేశ్ ఇప్పుడు మరోసారి అస్వస్థకు గురయ్యారు.
ఇవీ చూడండి:
Last Updated : Jun 25, 2022, 2:06 PM IST