ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలోనే నూతన విద్యా సంవత్సర క్యాలెండర్​: ఆదిమూలపు సురేష్​ - ap minister adimulapu suresh on new educational year calender news

రాష్ట్రంలో కొవిడ్​ కారణంగా విద్యార్థులకు సమయం వృథా కాకుండా ఆన్​లైన్​ తరగతులు నిర్వహించేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్​ వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు నాడు - నేడు కార్యక్రమం కింద పాఠశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.

త్వరలోనే నూతన విద్యా సంవత్సర క్యాలెండర్​: ఆదిమూలపు సురేష్​
త్వరలోనే నూతన విద్యా సంవత్సర క్యాలెండర్​: ఆదిమూలపు సురేష్​

By

Published : Jul 16, 2020, 8:04 PM IST

రాష్ట్రంలో త్వరలోనే నూతన విద్యా సంవత్సర క్యాలెండర్​ ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​​ తెలిపారు. ఈ లోపు సమయం వృథా చేయకుండా విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు ఏ విధంగా నిర్వహించాలనే దానిపై విధి విధానాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పర్యటించారు. సీఎం సహాయ నిధి కింద 59 మంది లబ్దిదారులకు సుమారు రూ.19 లక్షల విలువైన చెక్కులు అందించారు.

కరోనాతో ఇబ్బందులున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని మంత్రి సురేష్​ తెలిపారు. కేవలం అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టామన్న మంత్రి.. రాష్ట్రంలో దాదాపు 11 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. నాడు - నేడు కార్యక్రమం కింద పాఠశాలలు తెరిచే లోపు పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details