ప్రకాశం జిల్లా కురిచేడు సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద 27 మంది వలస కూలీలను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పనుల కోసం గుంటూరు జిల్లా పత్తిపాడుకు వెళ్లినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక తిరిగి సొంతూరైన కర్నూలు జిల్లా ఆదోనికి నడుచుకుంటూ బయలుదేరినట్లు వివరించారు. గత మూడు రోజుల నుంచి నడుస్తూనే ఉన్నామని చెప్పారు. వీరిని ఎస్సై రామిరెడ్డి కురిచేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వీరిని క్వారంటైన్‌ను కానీ రిలీఫ్ సెంటర్‌కు తరలిస్తామని ఎస్సై తెలిపారు.
ఉపాధి లేక సొంతూరికి కాలినడకన వలస కూలీలు - migrant labourers at kurchedu railway track
వారంతా వలస కూలీలు... పనుల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక సొంతూరికి కాలినడకన బయలుదేరారు. రైల్వే ట్రాక్ వద్ద వీరిని గుర్తించిన పోలీసులు వివరాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా కురిచేడు సమీపంలో జరిగిన ఘటన వివరాలివి..!

migratory-people-found-in-kurichedu-rail-way-track-in-prakasam
TAGGED:
migatory people problems