ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ క్వారీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు తమను సొంత గ్రామాలకు పంపించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా క్వారీలు, పరిశ్రమలు మూతపడిన కారణంగా.. వీరంతా 40 రోజులుగా పనుల్లేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇటీవల పరిశ్రమల నిర్వహణకు కొంత వెసులు బాటు ఇవ్వటంతో వీరందరినీ మళ్లీ పనుల్లోకి తీసుకునేందుకు క్వారీ, పరిశ్రమల యజమానులు సిద్ధంగా ఉన్నారు.