ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ప్రకాశం జిల్లాకు వచ్చిన వలస కూలీలను... స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బంగ, బిహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి జిల్లాలోని గిద్దలూరుకు వచ్చిన 95 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిని సొంత రాష్ట్రాలకు తరలించనున్నారు.
స్వరాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలు - గిద్దలూరులో వలస కూలీలు
లాక్ డౌన్ కారణంగా మన రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉంటున్న 95 మంది వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
స్వరాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలు