కనిగిరిలో బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మానసిక రోగి - కనిగిరి వార్తలు
![కనిగిరిలో బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మానసిక రోగి kanigiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13352144-801-13352144-1634196099240.jpg)
10:33 October 14
ప్రయాణికులతో పామూరు వెళ్లేందుకు సిద్ధమైన బస్సుకు నిప్పు
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆర్టీసీ బస్సుపై పెట్రోలు పోసి మతిస్థిమితం లేని ఓ యువకుడు నిప్పంటించాడు. పామూరు బస్టాండ్ కూడలిలో బస్సు నిలిపి డ్రైవర్ టిఫిన్ చేయడానికి వెళ్లిన సమయంలో మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు బస్సు పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు ఆర్పివేశారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా....పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. యువకుడికి మతిస్థిమితం లేదని పోలీసులు ప్రాథమిక నిర్థరణకు వచ్చారు.
ఇదీ చదవండి: Covid cases in India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు