ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద వరి పొట్టు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడు చిత్తూరు జిల్లాకు చెందిన నరసింహారెడ్డిగా గుర్తించారు. ముండ్లమూరు మండలంలోని తమ్మలూరు ఉమామహేశ్వరపురంలో వ్యవసాయ శాఖలో ఆయన పనిచెస్తున్నట్లు పొలీసులు పేర్కొన్నారు. మృతదేహన్ని పంచనామా కోసం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరి పొట్టు ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి - అద్దంకి వద్ద రోడ్డు ప్రమాదం
వరిపొట్టు ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరి పొట్టు ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి