ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, కఠారివారిపాలెం గ్రామాల్లోని మత్స్యకారుల సమస్యలపై మత్స్యశాఖ జాయింట్ డైరక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సమీక్షించారు. ఈ మేరకు మత్స్యశాఖ, పోలీస్, రెవిన్యూ అధికారులు, మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న బల్ల, ఐలా వలలను నిషేధం, మరికొన్ని నిబంధనల కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని మత్స్యకారులు... అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురి వాదనలు విన్న అధికారులు.. సమస్యలను లిఖిత పూర్వకంగా ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని జేడీ తెలిపారు.
మత్స్యకారుల మధ్య వలల విషయంలో ఏర్పడిన వివాదం... మంత్రి అప్పలరాజు, అధికారుల సమక్షంలో పరిష్కారం అయిందని జేడీ తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఏఈ రంగనాథ్, చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్,ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, మత్స్యకారులు పాల్గొన్నారు.