ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో జీవనోపాధికోసం వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చీమకుర్తి ఉన్నత పాఠశాల ఆవరణలో వైద్య బృందాల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్, బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 8వేల మంది క్వారీ, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లలో ఇక్కడ పనిచేస్తున్నారు.
వలస కూలీలను స్వస్థలాలకు పంపించేముందు వైద్య పరీక్షలు - migrant workers latest news in prakasam
వలస కూలీలు తమ స్వస్థలాలకు తమను పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. అందరికీ పరీక్షలు పూర్తయితేనే వాహనాలు సిద్ధం చేస్తారు.
లాక్‌డౌన్ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ పనులు లేక, సొంత గ్రామాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వీరంతా చీమకుర్తిలో తమ గ్రామాలకు పంపించాలంటూ ఆందోళన చేసారు. దీనికి అధికారులు స్పందించి వైద్య పరీక్షలు నిర్వహించి , వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ముందు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు అందరికీ పూర్తయితేగానీ అధికారులు వాహనాలు ఏర్పాటు చేసి పంపించే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో వైద్య పరీక్షలు పూర్తయిన వారు కొందరు అధికారులు అనుమతితో సంబంధం లేకుండా వివిధ మార్గాల ద్వారా సొంత రాష్ట్రాలకు బయలుదేరారు.
ఇవీ చదవండి:తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు
TAGGED:
ప్రకాశం జిల్లాలో వలస కూలీలు