జాతీయ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా
జాతీయ వాద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికిల్ అసోసియంషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైద్య విద్యార్థులు ధర్నాకు దిగారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైద్య విద్యార్థులు, వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ప్రజా వ్యతిరేక, వైద్య విద్యకు వ్యతిరేకమైన బిల్లును తీసుకురావాలన్న ఆలోచనను కేంద్రం మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ వైద్య కమిషన్ బిల్లును తగలబెట్టి వారి నిరసన తెలిపారు. కష్టపడి వైద్య విద్యను పూర్తి చేసినా, డిగ్రీ కోసం మరో పరీక్ష నిర్వహించడం అన్యాయమి విద్యార్థులు వాపోయారు. ప్రజాస్వామ్య హక్కులకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును రద్దు చేయాలనీ, లేకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని అన్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఐఎంఏ వైద్యులు వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపారు.