ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాల మద్యం దుకాణంలో భారీ చోరీ - theft liquor store at chirala

చీరాలలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగింది.

Massive theft at a liquor store in sarees
చీరాలలో మద్యం దుకాణంలో భారీ చోరి

By

Published : Sep 30, 2020, 10:00 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని ప్రభుత్వం మద్యం దుకాణంలో రేకులను పగలగొట్టిన దొంగలు.. భారీ చోరీ చేశారు. మద్యం బాటిళ్లు, నగదు ఎత్తుకెళ్లారు. స్వర్ణ గేటు వద్ద రోజు మాదిరిగానే దుకాణంలో సూపర్ వైజర్​ శివారెడ్డి తాళాలు తీశాడు. దుకాణంలో మద్యం సీసాలు, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.

123 బాటిళ్లు మాయమయ్యాయని.. వీటి విలువ సుమారు 35 వేల రూపాయలు ఉంటుందని శివారెడ్డి తెలిపారు. మద్యం అమ్మకాలు జరిపిన ఒక లక్ష 12 వేల రూపాయలు నగదును దుండగులు దోచుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. రంగంలోకి దిగిన సివిల్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details