కరోనా వైరస్ నివారణకు మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 'కరోనా వైరస్‌కు మాస్క్ కవచం.. స్వీయ నియంత్రణే రక్షణ' అనే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.
కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని.. ఆ శ్రమను ప్రజలు గుర్తించి బాధ్యతగా మెలగాలని కోరారు. వైరస్‌పై అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ర్యాలీలో కలెక్టర్ పోల భాస్కర్, ఎంపీ శ్రీనివాసులురెడ్డి, డీఎంహెచ్ఓ రత్నవేణి, ఉద్యోగులు పాల్గొన్నారు.