ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కు లేకుంటే రూ.500.. భౌతిక దూరం పాటించకపోతే రూ. 5వేలు - చీరాలలో కరోనా వార్తలు

కరోనా నేపథ్యంలో బయటకు వస్తే మాస్కు పెట్టుకోవాలి.. దుకాణాలకు వెళ్తే భౌతిక దూరం పాటించాలి.. అని పోలీసులు, అధికారులు మొత్తుకుంటున్నా.. కొంతమంది వినడంలేదు. అందుకే అలాంటి వారికి చెక్ పెట్టేలా ప్రకాశం జిల్లా చీరాల అధికారులు జరిమానాలు విధించనున్నారు. నేటినుంచి మాస్కు లేకుండా తిరిగితే డబ్బులు సమర్పించుకోక తప్పదు.

mask compulsory rule at chirala prakasam district
చీరాలలో లాక్ డౌన్ షరతులు

By

Published : May 9, 2020, 2:25 PM IST

చీరాలలో లాక్ డౌన్ షరతులు

ఎంత చెప్పినా వినకుండా... మాస్కులు లేకుండా తిరిగే వారికి ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు చెక్ పెట్టనున్నారు. నేటి నుంచి పట్టణంలో బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని చెప్పారు. లేకుంటే 500 రూపాయలు జరిమానా విధిస్తామన్నారు.

అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే రూ. 500 చెల్లించాలని షరతులు విధించారు. దుకాణాల ముందు వినియోగదారులు భౌతిక దూరం పాటించకపోతే యజమానికి 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details