ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మందులు అధిక ధరలకు అమ్మొద్దు' - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

మార్టూరు మండలంలో ఉన్న మెడికల్​ షాపు యజమానులతో ఎస్సై శివ కుమార్​ సమావేశమయ్యారు. మందులు అధిక ధరలకు అమ్మవద్దని, డాక్టర్​ చీటీ లేకుండా మందులు ఇవ్వొద్దని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే ఔషధ దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

martur si meeting with medical shop owners
మెడికల్​ షాపు యజమానులతో మాట్లాడుతున్న ఎస్సై

By

Published : Apr 28, 2020, 9:37 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని మెడికల్​ షాపు యజమానులతో స్థానిక ఎస్సై శివకుమార్​ సమావేశం నిర్వహించారు. ఔషధాలు అధిక ధరలకు అమ్మ వద్దని, స్లిప్పు ఉంటేనే మందులు ఇవ్వాలని చెప్పారు. ఎవరైనా తీవ్రమైన జలుబు, దగ్గుతో షాపుకు వస్తే తమకు తెలియపరచాలని ఎస్సై దుకాణ యజమానులకు సూచించారు. ఎవరైనా ఆర్​ఎంపీలు మందలు కొనుగోలు చేసిన తెలియపరచాలన్నారు. మందలు ఎవరికి అమ్ముతున్నారో రిజిస్టర్​లో ఎంట్రీ చేయాలని కోరారు. నిబంధనలు పాటించని ఔషద దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మార్టూరు ఎస్సై శివ కుమార్​ హెచ్చరించారు.

మెడికల్​ షాపు యజమానులతో మాట్లాడుతున్న ఎస్సై

ABOUT THE AUTHOR

...view details