ప్రభుత్వం మద్యం విక్రయం కోసం పంపిణీ చేస్తున్న టోకెన్లతో ప్రజలు బారులు తీరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని 8 దుకాణాల్లో... 3,200 టోకెన్లు పంపిణీ చేశారు. మార్కాపురం పట్టణ పరిధి కంటైన్మెంట్లో ఉండడంతో 4 దుకాణాల్లో మద్యం సరఫరా నిలిపివేశారు.
కరోనా.. ఎండ.. మమ్మల్నేం చేయలేవు!
ప్రకాశం జిల్లా మార్కాపురం వైన్‌షాపుల ముందు... మందు ప్రియులు ఎండను సైతం లెక్క చేయకుండా బారులు తీరారు. మందుబాబుల కోసం రెండు రోజులకు సరిపడా టోకెన్లను.. ఒకేరోజు పంపిణీ చేశారు.
markapuram people are waitting for wine with Tokens wtithout follow corona lockdown in prakasham
మిగిలిన 8 చోట్ల టోకెన్ల కోసం.. జనం భారీగా తరలివచ్చారు. వచ్చిన వారి సంఖ్య ఎక్కువవడంతో 2 రోజులకు సరిపడా టోకెన్లు ఒకేసారి పంపిణీ చేశారు. తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా.. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా మందు ప్రియులు క్యూలో నిల్చున్నారు.