ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకుంఠిత దీక్షతో అలుపెరుగని పోరు.. మార్కాపురాన్ని జిల్లా చేయాలని కోరుతూ స్వచ్చందంగా బంద్ - NEW DISTRICTS ISSUE

NEW DISTRICTS ISSUE: మార్కాపురాన్ని జిల్లా చేయాలని కోరుతూ.. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. తెల్లవారు జాము నుంచి జేఏసీ నాయకులు ద్విచక్ర వాహనాలపై పట్టణంలో పర్యటించారు. దుకాణాలు, కూరగాయల మార్కెట్, పండ్ల వ్యాపారులు ఇప్పటికే స్వచ్చందంగా మూసివేశారు.

NEW DISTRICTS ISSUE
NEW DISTRICTS ISSUE

By

Published : Feb 15, 2022, 9:18 AM IST

Updated : Feb 15, 2022, 1:29 PM IST

NEW DISTRICTS ISSUE: ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని జిల్లా చేయాలని కోరుతూ మార్కాపురంలో బంద్ నిర్వహిస్తున్నారు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అఖిల పక్షం నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు. తెల్లవారు జాము నుంచి జేఏసీ నాయకులు ద్విచక్ర వాహనాలపై పట్టణంలో పర్యటించారు. దుకాణాలు, కూరగాయల మార్కెట్, పండ్ల వ్యాపారులు ఇప్పటికే స్వచ్చందంగా మూసివేశారు.

సాధన సమితి ఛైర్మన్ కందుల నారాయణరెడ్డి ఆర్టీసీ బస్టాండ్​కు చేరుకొని ప్రయాణికులతో మాట్లాడారు. ఈ బంద్ జిల్లా కోసం చేపడుతున్నామని మీరు కూడా మద్దతు తెలిపి.. ఈ ఒక్క రోజు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్సుల్లో ఎక్కిన వారిని కిందకు దింపారు. అక్కడక్కడ తెరిచిన టీ, టిఫిన్ దుకాణాలను జేఏసీ నాయకులు మూయించి వేస్తున్నారు.

ఇదీ చదవండి: నూతన జిల్లాల ఏర్పాట్లపై ఆగని నిరసనలు.. కదం తొక్కిన విద్యార్ధులు

Last Updated : Feb 15, 2022, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details