మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం ఐకాస నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ దీక్షను తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు భగ్నం చేశారు. సీఐ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో 30 మంది పోలీసులు మూకుమ్మడిగా దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు, జిల్లా సాధన సమితి నేతల మధ్య కాసేపు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైకాపా నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాద్తో పాటు మరి కొందరిని 108 వాహనాల్లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ఐకాస నాయకులు మార్కాపురం జిల్లా నినాదాలు చేశారు. ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే కానీ మార్కాపురం జిల్లాను వదులుకొనే ప్రసక్తే లేదని ఐకాస నాయకులు తెలిపారు.
మార్కాపురం జిల్లా సాధన నాయకుల ఆమరణ నిరాహారదీక్ష భగ్నం - మార్కాపురం జిల్లా వార్తలు
మార్కాపురం జిల్లా సాధన నాయకుల ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో .. ఐకాస నాయకులను ఆస్పత్రికి తరలించారు.
ఆమరణ నిరాహారదీక్ష
మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 40 రోజులుగా నేతలు రీలే దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం స్పందించక పోకపోవడంతో ఐకాస నాయకులు ఆమరణ దీక్షకు దిగారు.
Last Updated : Mar 19, 2022, 4:48 AM IST