ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలకూరపాడులో ఆర్కే సంస్మరణ సభ - Maoist leader rk latest news

మావోయిస్టు అగ్రనేత ఆర్కే(Maoist leader rk) సంస్మరణ సభను ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో నిర్వహించారు. ఆర్కే మృతిని స్మరించుకుంటూ పాటలు పాడారు. సంస్మరణ సభకు తరలివస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని.. ఇది చాలా దారుణమని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్కే సంస్మరణ సభ
ఆర్కే సంస్మరణ సభ

By

Published : Oct 24, 2021, 5:55 PM IST

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే(Maoist leader rk) సంస్మరణ సభను ప్రకాశం జిల్లా(Prakasam district) టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో నేతలు ఏర్పాటు చేశారు. ఈ సభకు చుట్టుపక్కల నుంచి అనేకమంది తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారులు అరుణోదయ విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్కే తనయుడు పృథ్వి అలియాస్ మున్నా ఐదవ వర్ధంతి కూడా నేడే.

ఆర్కే సంస్మరణ సభకు వస్తున్న పలువురు పోలీసులు అడ్డుకుంటున్నారని.. ఇది చాలా దారుణమని విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఆర్కే గొప్ప ఉద్యమకారుడని కొనియాడారు. ఆర్కే మృతిని స్మరించుకుంటూ పాటలు పాడారు.

ఆలకూరపాడులో ఆర్కే సంస్మరణ సభ

ఇదీ చదవండి

Maoist leader RK: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details