ప్రకాశం జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చనిపోయాడని అనుకున్న వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. 35 రోజుల క్రితం మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే ముండ్లపాడుకు చెందిన సైదుమియా అనే వ్యక్తికి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వ్యక్తికి దగ్గర పోలికలు ఉండడంతో కుటుంబ సభ్యులు పొరపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం సైదుమియా ఇంటికి రావడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతలోనే తేరుకొని హర్షం వ్యక్తం చేశారు. ఇన్నిరోజులూ తెలంగాణలోని ఆర్మూరులో ఉన్నట్లు సైదుమియా తెలిపాడు.
మరణించాడని అంత్యక్రియలు... కానీ అంతలోనే..! - ప్రకాశం జిల్లాలో వింత ఘటన
నెలరోజు క్రితం గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు... ఓ కుటుంబం ఆ వ్యక్తి తమవాడేనని బోరున విలపించారు... అంత్యక్రియలు సైతం నిర్వహించారు... చెట్టంత మనిషిని కోల్పోయామనే బాధ నుంచి ఇంకా తేరుకోలేదు... అంతలో ఆ మనిషి ఇంటికి వచ్చాడు... అంతా ఒకింత ఆశ్చర్యానికి, మరొకింత భయానికి గురయ్యారు. కాసేపటికి కోలుకుని బతికే ఉన్నావా అంటు గుండెలకు హత్తుకున్నారు. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందంటే..?
సైదుమియా