ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగర్పల్లిలో బంగ్లా వెంగయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం గ్రామం నుంచి వెళ్తున్న వాహనాన్ని జనసేన నాయకులు అడ్డుకున్నారు. అక్కడే వెంగయ్య కూడా ఉన్నారు. అయితే సోమవారం ఉదయం వెంగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దూషించడం వల్లే బలవర్మరణానికి పాల్పడ్డని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
- రాజకీయం చేయొద్దంటున్న కుటుంబ సభ్యులు..
వెంగయ్య గతంలోనూ రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించాడని అతని బంధువులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం సింగర్పల్లి గ్రామంలో జరిగిన సంఘటనకు అతనికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. మృతుడు తన స్వగ్రామం పామూరులో నివసిస్తూ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడని.. ఇతను ఆత్మహత్యకు, ఎటువంటి రాజకీయ సంబంధం లేదని చెప్పారు. అసలు వెంగయ్య జనసేన నాయకుడే కాదని, వెంకయ్య మరణాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని వారి సోదరులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:సముద్రతీరంలోని వలలకు నిప్పంటించిన దుండగులు