ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicide Attempt: దర్శి పోలీసుస్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

suicide attempt in police station: దర్శి పోలీసుస్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కేసు విచారణలో భాగంగా స్టేషన్‌కు తీసుకెళ్లడాన్ని అవమానంగా భావించి.. స్టేషన్‌లోని గదిలో కండువాతో ఉరేసుకున్నాడు. కానిస్టేబుల్​ గమనించి ఆస్పత్రికి తరలించారు.

Man commits suicide
పోలీసుస్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 26, 2022, 9:48 AM IST

Man suicide attempt: ప్రకాశం జిల్లా దర్శి పోలీస్​స్టేషన్​లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దర్శి మండలం దేవవరం గ్రామానికి చెందిన వ్యక్తిపై.. తానాం చింతలకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆ కేసులో విచారణ నిమిత్తం 24వ తేదీన పోలీసులు.. ఆ వ్యక్తిని పోలీస్​ స్టేషన్​కు పిలిచారు. ఆ రోజు దర్శిలో తిరునాళ్లు జరుగుతుండటంతో అతనిని స్టేషన్​లోనే ఉంచారు. శుక్రవారం కూడా విచారణ నిమిత్తం అతనిని స్టేషన్​పై అంతస్తులో ఉంచారు. అది అవమానంగా భావించిన అతడు.. తన కండువాతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్​ అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details