ప్రకాశం జిల్లా అద్దంకి కలవకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. జేసీబీని ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీ పనులకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలైన వ్యక్తిని అద్దంకి ఆస్పత్రికి తరలించారు. ఇటుక బట్టీల నుంచి వెలువడే పొగ కారణంగా దారి కనిపించక ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు - peakasam disteict crime
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కలవకూరులో జరిగింది. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు Man killed in road accident in Prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6723633-268-6723633-1586424915592.jpg)
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి