నిన్ననే కొడుకు పుట్టి.. ఆ పిల్లాడి తండ్రి చనిపోతే.. ఆ విషయం మృతుడి భార్యకు తెలియపోతే. అది వినేందుకే.. మనసు కలుక్కుమంటోంది. ఘటన జరిగిన ఇంట్లో విషాదమెంతో? ఆలోచనలకు అందనంతా... ఊహకు తెలియనంతా. భర్త చనిపోయాడనే.. విషయం.. భార్యకు చెప్పెదేలా? అప్పుడే పుట్టిన బిడ్డతో ఆస్పత్రిలో ఆనందంగా ఉంది. భర్త చనిపోయాడనే.. చేదు నిజం తెలిస్తే.. ఆ తల్లి ఎంత తల్లడిల్లుతోంది. ఆమె పరిస్థితి ఊహించగలమా?
ప్రకాశం జిల్లా, దర్శిమండలం, అబ్బాయిపాలానికి చెందిన పిట్టం అజేయరెడ్డి, శివమణికి ఏడాది క్రితం వివాహమైంది. కొన్ని రోజుల క్రితమే.. పురిటి నొప్పుల రాగా .. దర్శిలోని ఓ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. నిన్న శివమణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టాడనే.. వార్తతో ఆ ఇంట్లో ఆనందం అంతా ఇంతా కాదు. ఆస్పత్రికి వచ్చి.. కొడుకును తనివి తీరా చూసుకున్నాడు అజేయరెడ్డి. అవే ఆఖరి చూపులు అవుతాయని తెలియదు పాపం తనకు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. తన కొడుకు గురించి.. పదే పదే చెప్పాడు. కొడుకు గురించి చెప్పిన ఆ మాటలే ఆఖరి మాటలయ్యాయి.