ప్రకాశం జిల్లా కనిగిరిలో.. విద్యుదాఘాతంతో మూడో వార్డు సచివాలయ విద్యుత్ ఉద్యోగి విష్ణువర్ధన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామ నీళ్ల ట్యాంక్ వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావటంతో విష్ణువర్ధన్ రెడ్డి విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కనిగిరిలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - కనిగిరిలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా కనిగిరిలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కనిగిరి మూడో వార్డు సచివాలయ విద్యుత్ శాఖ ఉద్యోగి విష్ణుగా గుర్తించారు.
![కనిగిరిలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి Man dies of electrocution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11106568-353-11106568-1616392332433.jpg)
Man dies of electrocution
TAGGED:
ప్రకాశం జిల్లా తాజా వార్తలు