విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి - man died with current shock
పొలంలో తెగిపడిన కరెంట్ వైర్లు తాకి వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చోటు చేసుకుంది.
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా దర్శి మండల తూర్పు వెంకటాపురంలో గేదల మేతకు వెళ్లిన వెంకటేశ్వర్లు(26)అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గేదల మేతకు వెళ్లిన వెంకటేశ్వర్లు...పొలం బోరుకు అమర్చిన కరెంట్ వైర్లు గడ్డిలో కలిసి ఉన్న సంగతిని మరచి వైర్లను తాకటంతో విద్యుత్ షాక్ కి గురైయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే మరణించాడు. అనుకోకుండా జరిగిన పరిణామానికి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.