ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ భాషా అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందారు. ఇరవై రోజుల కిందట కొవిడ్ సోకడంతో వైద్యశాలలో చేరి కోలుకున్నారు. అయితే ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడంతో బ్లాక్ ఫంగస్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. బాషాను ఒంగోలు ఆస్పత్రిలో చేర్పించగా...మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. మార్కాపురానికి చెందిన ఆరుగురు ఇప్పటికే బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతున్నారు. ఈయన మృతితో జిల్లాలో రెండో మరణం నమోదైంది.
బ్లాక్ ఫంగస్‌తో మార్కాపురం వాసి మృతి - Black fungus cases in ap
బ్లాక్ ఫంగస్‌తో మార్కాపురం వాసి మృతి
Last Updated : May 18, 2021, 3:02 PM IST