ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ ప్రైవేటు స్కూల్ వద్ద జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మరణించిన వ్యక్తి శంఖవరం గ్రామానికి చెందిన నక్కా సురేష్(28)గా పోలీసులు గుర్తించారు. కనిగిరి నుంచి స్వస్థలానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం నుంచి పడి చనిపోయాడు. ఘటనపై కనిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ద్విచక్రవాహనం పైనుంచి పడి వ్యక్తి మృతి - కనిగిరి తాజా వార్తలు
కనిగిరిలో ద్విచక్రవాహనంపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కనిగిరిలో ద్విచక్రవాహనం నుంచి పడి వ్యక్తి మృతి