ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి - ప్రకాశం జిల్లా ఒంగోలు వార్తలు

మంచినీళ్లు తాగటానికి సాగర్ కాలువలోకి దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి మృతి చెందాడు. మృతుడు కురిచేడు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

man dead in sagar canal
సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి

By

Published : Oct 20, 2020, 12:03 PM IST


సాగర్ కాలువలో మంచినీటి కోసం దిగుతుండగా కాలుజారి కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కురిచేడు గ్రామం ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్రాన్సిస్ (50) సాయంత్రం సమయంలో మంచినీళ్లు తాగడానికి సాగర్ ప్రధాన కాలువలోకి దిగుతుండగా కాలుజారి పడిపోయాడని ఎస్సై వెల్లడించారు. కాలువలో పడినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కొంత దూరంలో మృత దేహాన్ని గుర్తించిన పోలీసులు స్థానికుల సహకారంతో ఒడ్డుకు చేర్చారు.

ఇదీ చదవండి: సెల్ టవర్ ఎక్కాడు.. చివరికి 'హామీ' సాధించాడు!

ABOUT THE AUTHOR

...view details